VallabhaneniVamsi : వల్లభనేని అనుచరుల కోసం వేట.. విశాఖకు మరో పోలీస్ టీమ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-19 11:37:12  IST  )

సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు....

VallabhaneniVamsi :  వల్లభనేని అనుచరుల కోసం వేట.. విశాఖకు మరో పోలీస్ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు(Satyavardhan Kidnapping Case)లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణను మరింత ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ టీమ్ విస్తృతంగా గాలిస్తుండగా ఇప్పుడు విశాఖకు మరో టీమ్ వెళ్లింది. వంశీ అనుచరుడి ఇంటి సీసీ ఫుటేజ్‌‌పై పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ మేరకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

కాగా వైఎస్ జగన్ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు అయన అనుచరులు నిందితులుగా ఉన్నారు. దీంతో కొందరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి చేశారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీకి కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో ఆయన హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ కేసును వాపస్ తీసుకున్నారు. సాక్షాత్తు కోర్టులోనే ఆయన వాంగ్మూలం ఇచ్చారు. సాక్ష్యం చెప్పాలని పిలిచిన పోలీసులు.. టీడీపీ కార్యాలయంపై దాడిపై తనతో ఫిర్యాదు చేయించారని కోర్టుకు వివరించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ పరిణామం చోటు చేసుకున్న తర్వాత రోజే మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సత్యవర్థన్ తమ్ముడు కోటి విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించారని, అందువల్లే తన అన్న కోర్టులో కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ కీలకమని గుర్తించారు. దీంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో విచారించారు. అనంతరం కోర్టులో ప్రవేశ‌పెట్టారు. దీంతో ఆయనను ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపింది. అయితే ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ మేరకు వల్లభనేని వంశీ అనుచరుల కోసం గాలిస్తున్నారు.

Next Story