- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:అపచారం.. శ్రీవారి ఆలయం పై చక్కర్లు కొట్టిన విమానం.. ఈ సారి ఏకంగా!
కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది తరలి వస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది తరలి వస్తారు. అయితే హిందువులు భక్తిశ్రద్ధలతో కొలుచుకునే శ్రీవారి ఆలయంపై విమానాలు(Airplanes) చక్కర్లు కొడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కూడా ఆలయ గోపురంపై విమానాలు వెళ్లాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో నిన్న(గురువారం) ఒక్కరోజే ఎనిమిది విమానాలు వెళ్లాయి.
ఈ విమానాలు ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యన వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సారి ఏకంగా ఎనిమిది విమానాలు వెళ్లడం పై భక్తులు(Devotees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం.. శ్రీవారి ఆలయం(Temple)పై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. ఆలయంపై రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో విమానాలు ఆలయానికి సమీపం నుంచే వెళుతున్నాయి. ఇప్పటికే దీనిపై టీటీడీ ఛైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే.






