Breaking: విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

by Vemula.Srinu Prasad |

గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది...

Breaking: విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం ఎయిర్ పోర్టు(Gannavaram Airport)లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి గన్నవరం మీదుగా విశాఖ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండింగ్ చేశారు. విశాఖకు బయల్దేరుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో విమానంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక లోపాన్ని గుర్తించామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరమ్మతులు తర్వాత విమానం యథావిధిగా విశాఖకు బయల్దేరుతుందని పేర్కొన్నారు.

Next Story