పెన్షన్ సొమ్ముతో సచివాలయం ఉద్యోగి పరార్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండగలా జరిగింది...

పెన్షన్ సొమ్ముతో సచివాలయం ఉద్యోగి పరార్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ(Penstion Distribution) కార్యక్రమం పండగలా జరిగింది. అయితే ఓ చోట మాత్రం లబ్ధిదారులకు బిగ్ షాక్ తగిలింది. పెన్షన్ పంపిణీ సొమ్ముతో సచివాలయం ఉద్యోగి(Secretariat employee) పరార్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని చండ్రేడులో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే అధికారుల ప్రయత్నానికి సచివాలయం ఉద్యోగి బిగ్ షాక్ ఇచ్చారు. పింఛన్ల పంపిణీ సొమ్ము రూ.2,13,500తో పరారయ్యారు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు పెన్షన్లు కొంత మంది లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వారికి కూడా అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సచివాలయం ఉద్యోగి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story