జగన్ భద్రతపై ఆందోళన.. పార్టీ నేతల సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-19 16:07:37  IST  )

జగన్ భద్రతపై పార్టీ నేతల సంచలన నిర్ణయం తీసుకున్నారు..

జగన్ భద్రతపై ఆందోళన.. పార్టీ నేతల సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గుంటూరు(Guntur) మిర్చి యార్డు(Mirchi Yard)లో బుధవారం ఉదయం రైతులను కలిశారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే రైతుల వద్దకు వెళ్తున్న క్రమంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండదని, విపక్షంలో తమరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని నిలదీశారు.

అయితే ఈ ఘటనపై వైసీపీ నేతలు(Ycp Leaders) ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మాజీ సీఎం జగన్‌(Former Cm Jagan)కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఆరోపిస్తున్నారు. తమ అధినేత జగన్‌కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం అబ్దుల్ నజీర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మాట్లాడుతూ జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదన్నారు. వంశీని పరామర్శించడానికి లేని కోడ్‌ రైతు పరామర్శించడానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మాజీ సీఎం జెడ్‌ప్లస్‌ భద్రత ఉందని, ఒక్క పోలీస్‌ కూడా రాలేదన్నారు. లోకేశ్ ఆదేశాలతో పోలీసులు భద్రత కల్పించలేదని ఆరోపించారు.

Next Story