డ్రగ్స్ వ్యవహారంపై ఎంపీ పుట్టా మహేశ్‌కు నోటీసులు.. వివరణ ఇవ్వాలని టీడీపీ ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-15 15:03:42  IST  )

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌కు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది..

డ్రగ్స్ వ్యవహారంపై ఎంపీ పుట్టా మహేశ్‌కు నోటీసులు.. వివరణ ఇవ్వాలని టీడీపీ ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌(TDP MP Putta Mahesh Yadav)కు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం(Moinabad drug case)పై వివరణ ఇవ్వాలని, ఇందుకు ఐదు రోజులే గడువు ఇస్తున్నట్లు నోటీసుల్లో ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(TDP state president Palla Srinivasa Rao) హెచ్చరించారు. అలాగే డ్రగ్స్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇచ్చే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అసలు జరిగిందిదీ...

కాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Former MLA Pilot Rohit Reddy) ఫామ్ హౌస్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పాల్గొన్నారు. ఈగల్ టీమ్ జరిపిన దాడుల్లో పైలెట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేశ్ తో పాటు మొత్తం 10 మంది దొరికిపోయారు. యూరిన్ టెస్టుల్లో చేసిన పరీక్షల్లో రోహిత్ రెడ్డి పాజిటివ్ రాగా పుట్టా మహేశ్‌కు నెగిటివ్ వచ్చింది. దీంతో రక్త నమూనాలు తీసుకొని చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో పుట్టా మహేశ్ యాదవ్‌పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. నోటీసులు జారీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.




Next Story