హలీం కోసం ఎగబడ్డ జనం.. ఆ రెస్టారెంట్ వద్ద తోపులాట

by Disha Web Desk 2 |
హలీం కోసం ఎగబడ్డ జనం.. ఆ రెస్టారెంట్ వద్ద తోపులాట
X

దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ మాసం ప్రారంభం అయిందంటే చాలు అందరూ హలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరైతే హలీం కోసం ఏడాదంతా వెయిట్ చేస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ హలీం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ టేస్ట్ చేసిన ఎవరైనా పదిమందితో పంచుకుంటారు. అయితే, తాజాగా రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హలీం సెంటర్లు భారీగా ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల ఫ్రీగా హలీంలు సైతం పంచిపెడుతున్నారు. తాజాగా.. గుంటూరులో అరండల్‌పేట్‌లో ఓ రెస్టారెంట్ యజమాని ఫ్రీ హలీం అంటూ బోర్డు పెట్టారు. దీంతో భారీగా అక్కడకు హలీం ప్రియులు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు.


Next Story