- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూసుకుపోతున్న భారత్.. ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్‌పోర్టు ప్రారంభం
దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పాత ఎయిర్ పోర్టులకు మరమ్మతులతో పాటు కొత్త విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తోంది. ..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం(Nda Government) అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పాత ఎయిర్ పోర్టు(Airports)లకు మరమ్మతులతో పాటు కొత్త విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్ పోర్టును ప్రారంభిస్తోంది. ఎయిర్‌పోర్టుల ప్రారంభంతో దేశాలు, రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతోంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఎయిర్ పోర్టుల అవసరం ఉందో అక్కడ నిర్మాణాలకు శ్రీకారుం చుడుతోంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) తాజాగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా భారత్ అవతరించిందని తెలిపారు. సుస్థిరమైన వృద్ధిని కూడా సాధిస్తోందని, దీంతో ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా ఇండియా వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతీ 45 రోజులకు ఓ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఉడాన్ స్కీమ్ ద్వారా సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.






