మందు పార్టీ పేరుతో పిలిచి దారుణం.... ఎట్టకేలకు వీడిన మిస్టరీ

by Vemula.Srinu Prasad |

బేస్తవారిపేటలో దారుణ హత్యకు గురైన గాలి బ్రహ్మయ్య కేసు మిస్టరీ వీడింది...

మందు పార్టీ పేరుతో పిలిచి దారుణం.... ఎట్టకేలకు వీడిన మిస్టరీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) బేస్తవారిపేట(Bestavaripet)లో దారుణ హత్య(Murder)కు గురైన గాలి బ్రహ్మయ్య కేసు మిస్టరీ వీడింది. కంభం మండల దర్గా గ్రామానికి బ్రహ్మయ్యను సాయి తేజ అలియాస్ రవినే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్గా గ్రామానికి చెందిన యువతిని సాయి తేజ కొంత కాలంగా ప్రేమిస్తున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు, బంధువులకు గాలి బ్రహ్మయ్య తన గురించి తప్పుగా చెప్పారని, అందువల్లే పెళ్లికి ఒప్పుకోవడంలేదని సాయి తేజ కోపం పెంచుకున్నారు. 15 రోజుల ముందు నుంచే ప్లాన్ చేశారు. ఈ నెల 3న మందుపార్టీ పేరుతో బ్రహ్మయ్యను పిలిచి సాయి తేజ, అతని స్నేహితులు గొడవ పడ్డారు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని కొంతదూరం తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత రోజు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు కేసును ఛేదించారు. నిందితుడు సాయితేజను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story