- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్వేత మృతికి కారణం వాళ్లే.. తల్లి సంచలన ఆరోపణలు
by GSrikanth |
విశాఖ ఆర్కే బీచ్‌లో శ్వేత అనే ఓ మహిళ అనుమానాస్పద మృతి అందరినీ షాక్‌కి గురిచేసిన విషయం తెలిసిందే. డెడ్‌బాడీ పడి ఉన్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఆర్కే బీచ్‌లో శ్వేత అనే ఓ మహిళ అనుమానాస్పద మృతి అందరినీ షాక్‌కి గురిచేసిన విషయం తెలిసిందే. డెడ్‌బాడీ పడి ఉన్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతదేహం ఇసుకలో కూరుపోగా కేవలం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఒంటిపై దుస్తులు సరిగా లేవు.. ఇసుకలో సగం డెడ్‌బాడీ కప్పేసినట్టుగా ఉన్న ఆమె మృతదేహాన్ని చూస్తే.. ఇది హత్యా..? ఆత్మహత్యా అన్నది అంతుపట్టకుండా మారింది. అయితే, నేడు (ఏప్రిల్ 27) శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం జరుగనున్న నేపథ్యంలో ఆమె తల్లి సంచలన ఆరోపణలు చేసింది. అత్తింటి వేధింపులు భరించలే తన కూతురు మృతికి కారణమని ఆరోపించింది. ఈ సందర్భంగా శ్వేత అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది.
Next Story






