- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రానున్న 3 గంటల్లో వర్షం.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
ఏపీలోని పలు జిల్లాలకు మరో మూడు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది..

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ(Weather Department) వర్ష సూచన చేసింది. అంతేకాదు మరో మూడు గంటల్లో ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో వర్షం(Rains) పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
కాగా ఇప్పటికే కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. పలు చోట్ల రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 19న తీరం దాటే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.






