బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ

by Vemula.Srinu Prasad |

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో ఏపీ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ, వెడ్ డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో అల్పపీడనం(low pressure) ఏర్పడిందని, దీని ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తా(Coasta), రాయలసీమ(Rayalaseema)లో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు 5 జిల్లాలకు ఆరెంజ్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూ.గో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అటు కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story