- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండె జబ్జులు, షుగర్, బీపీ ఉన్నవారికి బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు ఈ పని అసలు చేయొద్దు..!
గుండె జబ్జులు, షుగర్, బీపీ ఉన్నవారికి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది..

దిశ, వెబ్ డెస్క్: గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారికి వాతావరణ శాఖ(Meteorology Department) బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు ఎండలో తిరగరాదని స్పష్టం చేసింది. శుక్ర, శని, ఆదివారం ఎండ, వడగాల్పుల తీవ్ర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు అకాల వర్షాలతో పాటు పిడుగులు(Thunderbolts) పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన అకాల వర్షాలు(Unseasonal rains with thunderstorms) పడేప్పుడు చెట్ల కింద నిల్చోవద్దని పేర్కొంది. చెవుల్లోకి వేడిగాలి వెళ్లే అవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి, రూమాలు వంటివి కట్టుకోవాలని చెప్పింది. తెలుపు రంగు కాటన్ వస్త్రాలను ధరించాలని, కళ్లపై ప్రభావం చూపకుండా సన్ గ్లాసెస్ వినియోగించుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో మొత్తం 17 మండలాల్లో శుక్రవారం తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం 12 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శని, ఆది వారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
గురువారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 43.7, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.6, విజయనగరంలో 42.8, కర్నూలు జిల్లా కామవరం, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.7, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 42.4, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో42.1 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, అలాగే 139 ప్రాంతాల్లో 41కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.






