ఏపీకి బిగ్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-12 16:02:48  IST  )

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది....

ఏపీకి బిగ్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు...!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు వాతావరణ శాఖ(Meteorology Department) బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా(North Coast, South Odisha) మీదుగా సముద్రం(Sea)లో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావం ఏపీపై ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం ఉత్తరాంధ్ర(Uttarandra), కోస్తా(Kosta), రాయలసీమ(Rayaseema)లో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా పునరావాసాలకు వెళ్లితే మంచిదని సూచించారు. విపత్తులకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Next Story