- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనజీవన స్రవంతిలోకి ఐదుగురు మావోయిస్టులు.. ఎస్పీ ఎదుట లొంగిబాటు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్జీఏ బెటాలియన్‌కు చెందిన ఐదుగురు సభ్యులు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సమక్షంలో లొంగిపోయారు. ..

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharamaraju District)లో మావోయిస్టు(Maoist) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్జీఏ (PLGA) బెటాలియన్‌కు చెందిన ఐదుగురు సభ్యులు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్(SP Amit Bardar) సమక్షంలో లొంగిపోయారు. అడవి బాటను వీడి, సాధారణ పౌరులుగా జీవించాలనే నిర్ణయంతో వీరు పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సైతం ఉండటం గమనార్హం. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితులై, హింసను వీడి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు.
మావోయిస్టులకు ఎస్పీ అమిత్ బర్దార్ స్వాగతం
లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఫలాలను అందుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని చెప్పారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయంతో పాటు అన్ని రకాల పునరావాస సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా అడవిలో ఉంటే జనజీవన స్రవంతిలో కలవాలని, హింసతో ఏదీ సాధించలేమని అమిత్ బర్దార్ తెలిపారు.






