- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు ఊరట.. విడిచిపెట్టిన పోలీసులు
రెండు తెలుగు రాష్ట్రాలను గత రాత్రి నుంచి కుదిపేసిన అంశం మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం. ఈ పార్టీలో రాజకీయ నేతలు దొరకడం ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది....

దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను గత రాత్రి నుంచి కుదిపేసిన అంశం మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ(Moinabad drugs party) వ్యవహారం. ఈ పార్టీలో రాజకీయ నేతలు దొరకడం ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దేశంలోని అన్ని పార్టీలు డ్రగ్స్ వ్యతిరేకంగా ఇప్పటికే పిలుపును ఇచ్చాయి. ఎవరూ డ్రగ్స్ తీసుకోవచ్చద్దని హెచ్చరించాయి.
కోర్టుకు పైలెట్ రోహిత్ రెడ్డి
అయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఈగల్ టీమ్(Eagle Team) జరిపిన దాడుల్లో బీఆర్ఎస్(Brs), కాంగ్రెస్(Congress), టీడీపీ(Tdp) నేతలు అడ్డంగా బుక్కవడం ఇప్పుడు ఆ మూడు పార్టీల్లోనూ పెను ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Former BRS MLA Pilot Rohit Reddy) ఫౌమ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అంతేకాదు వీరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే తాజాగా ఆయన్ను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టును తీసుకెళ్తున్నారు.
ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌కు నోటీసులు
ఇటు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను మాత్రం విడిచిపెట్టారు. ఆయనకు తొలుత చేసిన టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని, ఆ తర్వాత పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పోలీసులు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు నోటీసులు ఇచ్చి విడిచిపెట్టడంతో ఆయనతో పాటు అనుచరులు కూడా ప్రస్తుతానికి ఊపిరిపీల్చుకున్నారు. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.






