- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాశాఖలో లోకేష్ మార్క్.. విద్యాశాఖ ప్రకటనలో సరికొత్త రికార్డు!
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాజకీయరంగు పులుముకున్న విద్యను రాజకీయాలకు దూరం చేసే పనిలో మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారు.

దిశ, వెబ్‍డెస్క్: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. అడ్డంకులను అధిగమించడం, కష్టసాధ్యమైన లక్ష్యాలను ఇష్టంగా స్వీకరించడం తన నైజమని నిరూపిస్తూ, ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ఐదేళ్లలో రాజకీయ రంగు పులుముకున్న విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు.
చరిత్ర సృష్టించిన ఫుల్ పేజీ ప్రకటన
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఫలితాలు వస్తే ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలతో భారీ ప్రకటనలు ఇస్తుంది. కానీ, మంత్రి లోకేష్ ఆలోచనతో విద్యాశాఖ ఇచ్చిన తాజా ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పదో తరగతి ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు, వారు సాధించిన మార్కులు, పాఠశాలల వివరాలతో కూడిన ఈ ప్రకటనలో ఎక్కడా సీఎం చంద్రబాబు ఫోటో గానీ, మంత్రి లోకేష్ ఫోటో గానీ లేదు. కనీసం కూటమి ప్రభుత్వ రంగులు కూడా లేకుండా, కేవలం విద్యార్థుల ప్రతిభనే హైలైట్ చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతోంది.
నో పాలిటిక్స్.. ఓన్లీ ఎడ్యుకేషన్
"బడి గేటు లోపల రాజకీయాలకు తావులేదు" అనే నినాదాన్ని లోకేష్ అక్షరాలా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు రాజకీయ నేతల పేర్లు కాకుండా.. డొక్కా సీతమ్మ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల పేర్లు పెట్టడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తులు, క్రీడా పరికరాలపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చి అమలు చేయించారు.
ప్రభుత్వ బడుల వైపు మొగ్గు
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని లోకేష్ చాటిచెప్పారు. "అమ్మలా శిక్షణ - నాన్నలా రక్షణ" అనే నినాదంతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులతో ఏపీ ఎడ్యుకేషన్ మోడల్‌ను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ఆయన కృషి చేస్తున్నారు. మంత్రి లోకేష్ అనుసరిస్తున్న ఈ పారదర్శక విధానం పట్ల ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ మరిన్ని విజయాలు సాధిస్తుందని, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కల సాకారం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంద శాతం విశ్వాసం వ్యక్తం చేస్తుండటం అభినందనీయం.






