- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేసారి టెన్త్ పాసైన తల్లికొడుకు.. వీడియో పంచుకున్న మంత్రి లోకేష్
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించిందో గృహిణి. అందుకు సంబంధించిన వీడియో మంత్రి నారా లోకేష్ నెటిజన్లతో పంచుకున్నారు.

దిశ, వెబ్‍డెస్క్: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించిందో గృహిణి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ తల్లి, తన కుమారుడితో కలిసి పదో తరగతిలో ఫస్ట్ క్లాసులో పాసై.. అందరినీ ఆశ్చర్యపరిచారు.
గృహిణిగా ఉంటూనే పట్టుదలతో..
పాలకొల్లుకు చెందిన గృహిణి లక్ష్మీ లహరి, గతంలో కొన్ని కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అయితే.. విద్యావంతురాలు కావాలనే ఆమె సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతికి దరఖాస్తు చేసుకున్న ఆమె, తన కుమారుడు విజయ్‌తో కలిసి పరీక్షలకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో లక్ష్మీ లహరి 360 మార్కులతో , కుమారుడు విజయ్ 562 మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసయ్యారు.
మంత్రి నారా లోకేష్ అభినందనలు
ఈ తల్లీకొడుకుల అరుదైన విజయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వారిద్దరూ ఫలితాలు చూసుకుని సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభినందనలు తెలిపారు.
"చిన్న చిన్న కారణాలతో చదువును మధ్యలో నిలిపివేసే వారికి లక్ష్మీ లహరి ఒక గొప్ప స్ఫూర్తి. ఒకేసారి తల్లీకొడుకులు ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులైన క్షణం ఆ కుటుంబానికి ఎంతో గర్వకారణం. లక్ష్మీ లహరి గారికి నా అభినందనలు, విజయ్‌కి ఆశీస్సులు" అని లోకేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
విద్యాశాఖలో లోకేష్ మార్క్.. విద్యాశాఖ ప్రకటనలో సరికొత్త రికార్డు!






