- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి: నారా లోకేశ్
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై లోకసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభకు ముందుకు వెళ్లనుంది. ...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై లోకసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభకు ముందుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల విజయం.. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-నా రాజధాని అమరావతి(Andhra Pradesh -Capital Amaravati) అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని
‘‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(Andhra Pradesh Assembly) చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం.. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం.. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపింది. జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి’’ అంటూ ట్వీట్ చేశారు.






