గూడ్స్ రైలు నుంచి తెగిపోయిన వ్యాగన్ల లింక్.. కి.మీ వెళ్లిన తర్వాత గుర్తింపు

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లాలో గూడ్స్ రైలు నుంచి వ్యాగన్ల లింక్ తెగిపోయింది..

గూడ్స్ రైలు నుంచి తెగిపోయిన వ్యాగన్ల లింక్.. కి.మీ వెళ్లిన తర్వాత గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram)లో గూడ్స్ రైలు(Goods Train)కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై వెళ్తున్న సమయంలో వ్యాగన్ల లింక్ తెగిపోయింది. దీంతో కిలో మేటర్ మేర వెళ్లి 15 వ్యాగన్లు ఆగిపోయాయి. తాడిపత్రి- పుట్లూరు రోడ్డు రైల్వే గేటు వద్ద ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన లోక్ పైలట్ గూడ్స్ రైలును నిలిపివేశారు. అనంతరం రైలుతో వ్యాగన్లు అనుసంధానం చేశారు. ఆ తర్వాత గూడ్స్ రైలు కదిలి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనతో అంతపురం- గుంతకల్లు మధ్య రైల్వే రాకపోకలు ఆలస్యంగా జరిగాయి.

Next Story