- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది : బొత్స సత్యనారాయణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా.. ఇచ్చిన హామీల్లో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా.. ఇచ్చిన హామీల్లో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం వైజాగ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. మూడు రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని, ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు.
గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. అలాగే టెన్త్ క్లాస్ వాల్యుయేషన్లోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపించిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 500 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ చేయించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో 1650 మంది రీవాల్యుయేషన్ చేయించుకున్నారని, ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఎద్దేవా చేశారు. రోజుకు 40 పేపర్లు దిద్దే టీచర్లకు.. అంతకుమించి పేపర్లు ఇస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారన్నారు. ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుందని, కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయడంలో విఫలమవుతుందన్నారు.






