మచిలీపట్నంలో కుద్రపూజల కలకలం.. 32 కుటుంబాలకు చేశారంటూ వదంతలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-11 10:09:30  IST  )

మచిలీపట్నంలో కుద్రపూజలు కలకలం రేపాయి. గిలకలదిండి ప్రాంతంలో జరిగిన ఘటన కొద్దిపాటి ఆలస్యంతో వెలుగులోకి వచ్చింది...

మచిలీపట్నంలో కుద్రపూజల కలకలం.. 32 కుటుంబాలకు చేశారంటూ వదంతలు
X

దిశ, వెబ్ డెస్క్: మచిలీపట్నం(Machilipatnam)లో కుద్రపూజలు(Witchcraft)కలకలం రేపాయి. గిలకలదిండి(Gilakaladindi) ప్రాంతంలో జరిగిన ఘటన కొద్దిపాటి ఆలస్యంతో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఊరి నడిబొడ్డున పసుపు, కుంకుమ, గుడ్డతో చేసిన బొమ్మ, నిమ్మకాయలతో కూడిన ముగ్గు వేసి పూజలు చేశారు. ఈ తెల్లవారు జామున గ్రామస్తులు గమనించారు. అయితే గ్రామంలోని 32 కుటుంబాలకు చేతబడి(Black Magic) చేశారంటూ వదంతులు చెలరేగాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Next Story