- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపై జనసేన నేతల బాహాబాహీ.. ఉద్రిక్తత
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేన నేతలు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు(Nellore District Atmakur)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు(Jana Sena Party Membership Registration) కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేన నేతలు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. పార్టీ నేత వేముల పాటి అజయ్ కుమార్(Vemula Pati Ajay Kumar) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వమించడంపై ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ శ్రీధర్(Constituency Jana Sena Incharge Sridhar) అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ మేరకు పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా చేరుకుని చెదరగొట్టారు.
వెనక్కి తగ్గని శ్రీధర్ వర్గం
అయితే శ్రీధర్ వర్గం వెనక్కి తగ్గలేదు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారితో మాట్లాడి వివాదాన్ని సద్దుమనిగించారు. కానీ వేముల పాటి అజయ్ కుమార్ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేయడాన్ని శ్రీధర్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.






