- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPS: అంటకాగిన.. ఐపీఎస్‌లు అవుట్!
పాత తప్పులు వారందరినీ వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వంతో అంటకాగిన, ప్రతిపక్షాలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాత తప్పులు వారందరినీ వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వంతో అంటకాగిన, ప్రతిపక్షాలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. అటువంటివారిని ఉపేక్షించబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. బ్యూరోకాట్(bureaucrat) వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే గత ఏడాది పరిపాలనలో, అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన మొదలు పెట్టింది. నెలలోగానే భారీగా ఐపీఎస్‌ల బదిలీ చేపట్టింది. తర్వాత కొద్దినెలలకే ముంబై నటి జెత్వానీ కేసు వ్యవహారం వెలుగు చూసింది. ఆ కేసులో ఆమెను ముంబై నుంచి తీసుకొచ్చి వేధించారని ఏసీపీ, సీఐను మొదట సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విచారించిన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు (psr anjaneyulu), కాంతి రాణా టాటా (kranti rana tata), విశాల్ గున్నీపై (visal gunni)ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అంతేగాక వారిపై కేసు కూడా నమోదు చేసింది. అరెస్టు కాకుండా వారు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. తర్వాత అగ్నిమాపక డైరెక్టర్ జనరల్‌గా, సీఐడీ చీఫ్‌గా పనిసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌ను (n sanjay)ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన అధికారిక హోదాలను అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై విజిలెన్స్ విచారణ కూడా చేపట్టారు. ముఖ్యంగా ఆయన నాడు చంద్రబాబు సీఐడీ అధికారులు అరెస్టు చేస్తుండగా సంజయ్ పర్యవేక్షించారని చెబుతుంటారు.
తాజాగా ఇవాళ సీఐడీ మాజీ చీఫ్సునీల్కుమార్ను (sunil kumar) సస్పెండ్‌చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సునీల్‌కుమార్‌పై ఎప్పటి నుంచో అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్రఘురామకృష్ణమ రాజును (raghurama krishnamaraju) అక్రమంగా అరెస్టు చేసి థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనే అభియోగాలలో సునీల్ కీలకంగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారి విజయపాల్అరెస్టు అయ్యారు. ఈ క్రమంలోనే సునీల్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. కొంతకాలంగా ఆయన సస్పెండు అవుతారని, అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ పర్యటనలకు ప్రభుత్వం నుంచి ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఇది నిబంధనలు ఉల్లంఘించడమేనన్నది ప్రభుత్వ వాదన. సునీల్, సంజయ్ఇద్దరూ గత ప్రభుత్వంలో జగన్(ys jagan) ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారనే ఆరోపణలు ఉన్నాయి. సంజయ్పై నిధుల దుర్వినియోగం కేసుల నమోదవగా, సునీల్‌పై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వంలో నాటి పెద్దలతో అంటకాగిన ఐపీఎస్అధికారులను వీఆర్‌కు పంపింది. వారిని వెయిటింగ్లో ఉంచింది. వెయిటింగ్లో ఉన్న డీజీ ర్యాంకు అధికారులతో పాటు మిగిలిన ఐపీఎస్ అధికారులను రోజూ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని అదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికీ అనేక మంది ఐఏఎస్‌లు, ఇతర పోలీస్‌ఉన్నతాధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారు ఇంకా వీఆర్‌లోనే కొనసాగుతున్నారని సమాచారం. నాడు పెద్దల అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






