దారుణం.. గర్భవతిని చంపి నిప్పంటించిన దుండగులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-14 11:36:04  IST  )

గర్భవతిని చంపి నిప్పంటించిన ఘటన అనకాపల్లిలో జరిగింది.....

దారుణం.. గర్భవతిని చంపి నిప్పంటించిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: గర్భవతి(Pregnant)ని చంపి నిప్పంటించిన ఘటన అనకాపల్లి(Anakapalli)లో జరిగింది. 30 నుంచి 35 ఏళ్లున్న మహిళను చంపి కాళ్లు చేతులు కట్టి గొంతు నులిమి చంపారు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే మృతదేహం సగమే కాలిపోయింది. దారిన పోయిన వాళ్లు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. గుర్తు తెలియని మహిళగా, అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. గర్భవతి ఎవరు..?. ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. త్వరలోనే కేసును చేధిస్తామని తెలిపారు. అయితే ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.

Next Story