- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై గ్యాంగ్ రేప్: యువకులను పట్టుకుని చితక్కొట్టిన గ్రామస్తులు
బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన చిత్తూరులో జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన చిత్తూరులో జరిగింది. మురకంబట్టు నగరవనంలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడి గొంతుపై కత్తి పెట్టి ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ముగ్గురు యువకులను పట్టుకుని చితక్కొట్టారు. అయితే ఆ తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ ఈ ఘటన మాత్రం చిత్తూరులో రాజకీయ దుమారం రేపింది. నిందితులు స్థానిక పార్టీల నాయకులతో కలిసి మెలిసి తిరిగారు. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అయితే ఈ ఘటనపై డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఈనెల 25న తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. నిందితులపై పోక్సో యాక్ట్ కింద, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితులు మహేష్, హేమ చంద్ర, కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.






