గొందిపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

by Vemula.Srinu Prasad |

విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు(Laborers) మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది..

గొందిపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ షాక్‌(Electric shock)తో ఇద్దరు కూలీలు(Laborers) మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju) జిల్లాలో జరిగింది. జి.మాడుగుల మండలం గొందిపల్లి(Gondhipalli)లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలీలు పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. దీంతో ఇద్దరు కూలీలకు విద్యుత్ షాక్‌ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తోటికూలీలు చూస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కరెంట్ సరఫరా నిలిపివేసి కూలీల డెడ్‌బాడీలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story