Home Minister Anita:చిన్నారి పై లైంగికదాడి ఘటన పై స్పందించిన హోంమంత్రి

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికల పై లైంగికదాడి(sexual assault) ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Home Minister Anita:చిన్నారి పై లైంగికదాడి ఘటన పై స్పందించిన హోంమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికల పై లైంగికదాడి(sexual assault) ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మూడు నెలల చిన్నారిపై లైంగిక దాడి, అనంతరం హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత(AP Home Minister Anitha) స్పందించారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా(Tirumala) వడమాలపేట మండలంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటన పై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడటం హేయమన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత వెల్లడించారు.

Next Story