అమరావతిలో శ్రీవారి పవిత్రోత్సవాలు.. ఈ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-18 16:02:54  IST  )

అమరావతి శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి...

అమరావతిలో శ్రీవారి పవిత్రోత్సవాలు.. ఈ సాయంత్రం  శాస్త్రోక్తంగా అంకురార్పణ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంటేశ్వర‌స్వామి ఆలయంలో మంగళవారం నుంచి 21 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. లోక కల్యాణార్థం తొలిసారిగా ఆల‌యంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణము, సేనాధిపతి ఉత్సవం, మృతస్సంగ్రహణం, అంకురార్ప‌ణ నిర్వహించారు.

ఇక మంగళవారం ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపట్టనున్నారు. 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వంచనున్నారు. 21న ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపట్టనున్నారు. ఈ మూడు రోజుల పాటు శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు

Next Story