హైకోర్టులో అంబటి రిట్ పిటిషన్.. రెండు వారాలు వాయిదా

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు రెండు వారాల పాటు విచారణ వాయిదా వేసింది...

హైకోర్టులో అంబటి రిట్ పిటిషన్.. రెండు వారాలు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌(Writ Petition)పై హైకోర్టు(High Court) రెండు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటు తన ఫ్యామిలీపైనా సోషల్ మీడియాలో ఐ టీడీపీ కార్యకర్తలు అనుచిత పోస్టింగులు పెట్టారని, అయితే తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో తాను ఐదు సార్లు ఫిర్యాదు చేస్తే నాలుగు సార్లు మాత్రమే కేసు నమోదు చేశారని, ఐదోసారి తీసుకోలేదని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఇన్ పర్సన్‌గా హైకోర్టులో అంబటి రాంబాబు తన వాదనలను వినిపించారు. ఐదో ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని పోలీసుల తరఫు లాయర్‌ తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

ఈ సందర్బంగా అంబటి మాట్లాడుతూ తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయడంలేదన్నారు. పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చానని చెప్పారు. ఐదో ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. తన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.

Next Story