ఏపీలో మూడు ఆస్పత్రులకు మహర్దశ.. భారీగా నిధులు మంజూరు

by Vemula.Srinu Prasad |

ఏపీలో మూడు ఆస్పత్రులకు భారీగా నిధులు మంజూరు చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది...

ఏపీలో మూడు ఆస్పత్రులకు మహర్దశ.. భారీగా నిధులు మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మూడు ఆస్పత్రులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మంగళగిరి(Mangalagiri), పిఠాపురం(Pithapuram), చిలకలూరిపేట(Chilakaluripet) ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి ఈ నిధులు మంజూరు చేస్తూ వైద్యారోగ్య శాఖ(Health Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు ఆస్పత్రులకు రోగుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ ఆస్పత్రులకు 2019 చంద్రబాబు హయాంలో నిధులు మంజూరు అయ్యాయి. అప్పట్లో కొంత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు కాలేదు. అయినా వైద్యం అందిస్తున్నారు. ఈ మూడు ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అత్యాధునికంగా అభివృద్ధి చేస్తే మరిన్ని సేవలు అందిచొచ్చని వైద్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. దీంతో ఈ ఆస్పత్రులకు మహర్దశ పట్టనుందని స్థానికులు అంటున్నారు.

Next Story