వినాయక మండపాలకు ఈ రాష్ట్రంలోనూ ఫ్రీ కరెంట్

by Vemula.Srinu Prasad |

ఏపీలో వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందించనుంది....

వినాయక మండపాలకు ఈ రాష్ట్రంలోనూ  ఫ్రీ కరెంట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ ఉత్సవాల(Ganesh Festival) సందడి మొదలైంది. ఈ నెల 27న వినాయక చతుర్థి సందర్భంగా ఏపీ(Ap), తెలంగాణ(Telangana)లో భక్తులు వినాయక మండపాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ మండపాలకు రెండు ప్రభుత్వాలు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా వినాయక మండపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఇందుకు రూ. 25 కోట్లు నిధులు కేటాయించింది. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 15 వేలు గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు అంచనా వేసింది. వినాయక మండపాలకు అయ్యే విద్యుత్ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Next Story