- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల ఉచిత బస్ టికెట్‌కు "స్త్రీ శక్తి"గా నామకరణం
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించనుంది...

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 15 నుంచి మహిళల(Women)కు ఉచిత బస్సు ప్రయాణాన్ని(Free Bus Ride) ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఇప్పటి వరకూ ధర కూడిన టికెట్‌ను ఇచ్చారు. ఉచితంగా ప్రయాణిస్తే టికెట్ ఎలా ఉంటుందని అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం టికెట్ నమూనాను రెడీ చేసింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు వీలుగా ముద్రించిన నమూనా టికెట్‌ను బయటకు విడుదల చేసింది. ఉచిత బస్ టికెట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, డిపో పేరు, "స్త్రీ శక్తి" (Sthree Sakti) గా టికెట్ పేరు, ప్రయాణించే ప్రదేశం, చేరాల్సిన గమ్యస్థానం వంటి అంశాల్ని దానిపై ముద్రించారు. చెల్లించాల్సిన మొత్తం ధర రూ.0.00గా ముద్రించిన టికెట్ బయటకు వచ్చింది. దీంతో ఈ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






