ప్రాజెక్టుల విషయంలో సర్కారుకు క్లారిటీ లేదు.. సీపీఐ నేత రామకృష్ణ

by Kema Shiva Kumar |

ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం క్లారిటీ లేదని సీపీఐ నేత రామకృష్ణ (Rama Krishna) అన్నారు.

ప్రాజెక్టుల విషయంలో సర్కారుకు క్లారిటీ లేదు.. సీపీఐ నేత రామకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం క్లారిటీ లేదని సీపీఐ నేత రామకృష్ణ (Rama Krishna) అన్నారు. ఇవాళ ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపడుతోన్న పలు ప్రాజెక్టుల అలైన్‌మెంట్లు పదే పదే మార్చుతుండటం ఆందోళనకరమని అన్నారు. అప్పుడు పోలవరం.. సోమవారం అన్నారని.. ఇప్పుడు ఆ పేరే ఎత్తడం లేదని సెటైర్లు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు పొలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, రెండో సారి అధికారంలోకి వచ్చాక పోలవరం విషయాన్నే మరిచారని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించినా ఎవరూ మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిన హంద్రినీవ, గాలేరు, నగిరి, వెలుగొండ ప్రాజెక్టుల గురించి సర్కార్ ప్రస్తావన తీసుకురావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో చేపడుతోన్న ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలన్నారు. త్వరలోనే ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి రామకృష్ణ సూచించారు.

Next Story