- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమతి ఇవ్వండి... పనులు ప్రారంభిస్తాం: కీలక ప్రతిపాదన చేసిన చంద్రబాబు
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం(Banakacharla Project Construction )పై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఖర్చు వివరాలను కూడా అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం(Central Government) దృష్టికి తీసుకెళ్లింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ(Rayalaseema) వాసుల నీటి కష్టాలపై దృష్టి పెట్టింది. 200 టీఎంసీల నీటిలో సమస్య పరిష్కారం ఉందని గుర్తించింది. సముద్రంలో వృదాగా పోతున్న నీటిని అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసి కేంద్రప్రభుత్వానికి అందజేసింది. ఇక ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఢిల్లీ(Delhi)లో పర్యటనలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman) దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ఈ రోజు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన విభ జన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన చంద్రబాబు.. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు రూ.80 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చని చెప్పారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కేంద్రం అనుమతి ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు.






