- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని కోసం మరో 44 వేల ఎకరాల భూసమీకరణ.. ఈ గ్రామాల్లో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్..!
రాజధాని కోసం మరో 44 వేల ఎకరాల భూసమీకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati)లో మరో 44 వేల ఎకరాల భూమి(Land)ని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరి పరిధిలో భూములు సేకరించనుంది. ఈ భూసమీకరణకు రెండు, మూడు రోజుల్లో సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. తుళ్లూరు మండలం హరిచంద్రపురం, వడ్డమాను, పెదపరిమిలో 9,919 ఎకరాలు, అమరావతి మండలం నిడముక్కల, మొత్తడాక, ఎండ్రాయి, వైకుంఠపురం,కార్లపూడిలో 12,838 ఎకరాలు, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో 16,463 ఎకరాలు, మంగళగిరి కాజాలో 4,492 ఎకరాల భూములు సేకరించాలని నిర్ణయించింది.
కాగా ఏపీ రాజధాని కోసం అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలను సీఆర్డీఏ ఇప్పటికే ల్యాండ్ ఫూలింగ్ చేసింది. అమరావతి ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలో భూసేకరణ చేశారు. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకూ రైల్వే లైన్ కోసం రైతులు, స్థానిక ప్రజలనుంచి ఇప్పటికే భూములు సేకరించారు. తాజాగా అమరావతి అభివృద్ధిలో భాగంగా మరో 44 వేల ఎకరాల భూములు కావాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ప్రకటన చేసింది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.






