గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఫోకస్.. అమరావతిలో కీలక భేటీ

by Vemula.Srinu Prasad |

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి పుష్కరణాల నిర్వహణపై ఫోకస్ పెట్టింది...

గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఫోకస్.. అమరావతిలో కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: గోదావరి పుష్కరాల(Godavari Pushkarala)ను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి పుష్కరణాల నిర్వహణపై ఫోకస్ పెట్టింది. మహా కుంభమేళ(Maha Kumbh Mela) తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత అనుభవాలు రిపీట్ కాకుండా పటిష్టంగా సిద్ధాంత పరంగా నిర్వహించేందుకు కసరత్తులు ప్రారంభించింది. వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే గోదావరి పుష్కరాల బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. దీంతో తాజాగా అమరావతిలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. మంత్రులు కందుల దుర్గేష్, బి.సి. జనార్దన్‌, సత్యకుమార్, గొట్టిపాటి, మండిపల్లితో పాటు ఉన్నతాధికారులు హాజరై చర్చిస్తున్నారు. పుష్కరాలు ఘనంగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.

Next Story