- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు(Power Rates) పెంచబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖ(Electricity Department)క్లారిటీ ఇచ్చినా కొందరిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పవర్ ఛార్జీల పెంపుపై ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress), కమ్యూనిస్టు పార్టీలు(Communist Parties) ధర్నాలు, నిరసన వ్యక్తం చేశాయి. అప్పటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జరుగుతూనే ఉంది.
సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ఆయన అధ్యక్షతన అమరావతిలో గురువారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపు అంశం చర్చకు వచ్చింది. దీంతో కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మంత్రులకు సూచించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలు(Suryagarh and PM Kusum Schemes) రాష్ట్రంలో వేగంగా అమలయ్యేలా ఆదేశాలివ్వాలన్నారు. వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు పున:ప్రారంభమయ్యేలోపు డీఎస్పీ పోస్టులు భర్తీ చేయాలని మంత్రులతో పాటు అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదనే విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ నేతలు గుర్తించాలని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.






