ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-27 14:40:10  IST  )

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది....

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనలో సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా డ బదిలీలు చేపట్టింది. ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ విజయ్ కుమార్‌ను నెల్లూరు డీఆర్వో‌గా బదిలీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.ఎస్.నారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

విజయవాడ జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ జీవీవీ సత్యనారాయణ రామాయపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, మంగళగిరి ఎపీఎంబీ డిప్యూటీ కలెక్టర్ ఆర్ శివరావ్‌ను రామాయపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేసింది. చింతూరు‌లోని కూనవరం యూనిట్ డిప్యూటీ కలెక్టర్ కోమటినేని నరసయ్యను రామాయపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గాను, బాపట్ల సమగ్ర శిక్షణలో డిప్యూటీకలెక్టర్‌గా ఉన్న ఎం నాగిరెడ్డి రామాయపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story