- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్ధుల ఆరోగ్యాన్ని కూడా త్వరలోనే పరీక్షిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. అనకాపల్లి జిల్లా(Anakapalle District) తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల(Tallapalem Social Welfare Residential School)లో ముస్తాబు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు తెలిపారు. పాఠశాలకు చక్కటి యూనిఫాంతో, పరిశుభ్రంగా చదువుకోవాలని సూచించారు.తల్లితండ్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులపైనే ఆశలు పెట్టుకుందన్నారు. జీవితంలో ఏం సాధించాలన్నా చిన్న వయస్సు నుంచే కృషి చేయాలని చెప్పారు. విద్యార్ధులంతా రాష్ట్రానికి చెందిన ఆస్తి అని, విద్యార్థులు నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొన్ని ఆలోచనలు అందరిలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయని, అలాంటి కార్యక్రమమే ముస్తాబు అని తెలిపారు. దీన్ని అన్ని చోట్ల అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.






