జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 31న తుది నోటిఫికేషన్

by Vemula.Srinu Prasad |

జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 31న తుది నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్: జిల్లాల పునర్విభజన(Districts Reorganization)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జిల్లాలు, డివిజన్లు, మండలాల(Districts, divisions, mandals) పునర్విభజనపై అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో మంత్రులు, అధికారులతో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక నోటిఫికేషన్‌‌పై వ్యక్తమైన అభ్యంతారాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 927 అభ్యంతరాలను పరిశీలించారు. ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని సమీక్షలో నిర్ణయించారు. మార్పులు చేర్పుల తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

కాగా జిల్లాల పునర్విభజనపై గత నెల 27న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అభ్యంతరాలకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ గడువు శనివారంతో ముగియనుండటంతో తాజాగా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

Next Story