ఈహెచ్ఎస్ వైద్య సేవలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

ఈహెచ్ఎస్ వైద్య సేవలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..

ఈహెచ్ఎస్ వైద్య సేవలపై  ప్రభుత్వం  కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు(Medical services) అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సేవలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది. ఇందుకోసం అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. పూర్తి నివేదికను 8 వారాల్లో అందజేయాలని ఆర్డర్ వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఈ కమిటీకి ఛైర్మన్‌గా సీఎస్ కె.విజయానంద్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా జీఏడీ, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యుడు, కన్వీనర్‌గా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోను నియమించింది.

Next Story