- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని చరిత్రలో మరో కీలక ఘట్టం.. సానుకూలంగా ముందుకు వస్తున్న రైతులు
రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది...

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati) రెండో విడత భూ సమీకరణ(Land mobilization)ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో సభలు నిర్వహించింది. పెదకూరపాడు(Pedakurapadu)లో రైతులను అధికారులు కలిశారు. బలుసుపాడు, కంభంపాడులో గ్రామ సభలు నిర్వహించారు. రాజధానికి భూములివ్వడంపై కలిగే లాభాలను రైతులు, స్థానికులకు ఆర్డీవో రమాకాంత్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఇతర అధికారులు వివరిస్తున్నారు. ఈ మేరకు రైతులు కొన్ని అనుమానాలను, డిమాండ్లను వారికి చెప్పారు. దీంతో అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ మేరకు రాజధానికి భూమిలిచ్చేందుకు రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. రాజధానికి కావాల్సిన భూమిని ఇస్తామని తెలిపారు.
కాగా రాజధాని అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గతంలో రాజధాని రైతుల నుంచి 30 వేల ఎకరాలు సేకరించింది. ఈసారి మరో 40 వేల ఎకరాల దాకా కావాలని అంచనా వేసింది. ఈ మేరకు ప్రకటించింది. ఇందులో భాగంగా రైతులను ఒప్పించి భూసమీకరణ పనులను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టుగా పెద్దకూరపాడు వేదికగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.






