Ap: మున్సిపాలిటీలకు కీలక బాధ్యతలు..ఉత్తర్వులు జారీ

by srinivas |   ( Updated:2025-01-12 09:32:40.0  )
Ap: మున్సిపాలిటీలకు కీలక బాధ్యతలు..ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: భవన నిర్మాణాలు(Building structures), లే అవుట్‌ల(Layouts)కు అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసింది. అన్ని రకాల అనుమతులను మున్సిపాలిటీల(Municipalities)కు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్-2017, ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ రూల్స్- 2017లో సవరణలు చేసింది. ఈ మేరకు రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ‌ల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల(Gram Panchayats)కు అధికారాలను బదలాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరించింది.


ఇకపై భవనాలకు రకాల అనుమతులను మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు అనుమతించనున్నాయి. నగర పంచాయతీల్లో అయితే మూడెకరాలు దాటితే డీటీసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. గ్రామ పంచాయతీలు 300 చ.మీ,10 మీటర్ల ఎత్తు వరకూ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. అనధికారిక కట్టడాలపై మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు బదలాయింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకుంది.

Advertisement

Next Story