- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేతన్నలకు గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
నేతన్నల త్రిఫ్ట్ ఫండ్‌ను ప్రభుత్వం విడుదల చేసింది...

దిశ, వెబ్ డెస్క్: నేతన్నల(Weavers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్(Thrift Funds)ను విడుదల చేసింది. చేనేత సహకార సంఘాల బ్యాంకు(Handloom Cooperative Bank) ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసింది. ప్రతి సంవత్సరం రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్ట్ ఫండ్ నిధులను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో మొత్తం 5,726 మంది నేతన్నలకు లబ్ధిచేకూరనుంది. అయితే ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. గడిచిన డిసెంబర్‌లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించింది. ఇలా కేవల రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం జమ చేయడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.






