- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల(Ap Rtc Employees)కు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 1/2019 సర్యులర్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 48 మంది వేల ఆర్టీసీ ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. 1/2019 సర్యులర్‌ను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న తప్పులకు కూడా శిక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/2019 సర్యులర్‌కు కట్టుబడి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం కీలక చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రద్దు చేసిన 1/2019 సర్యులర్‌ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. సిబ్బందిపై చర్యలకు ముందు ఈ సర్యులర్ అంశాలను పాటించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎన్ఎంయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు.






