ముంబై నటి కేసు ఎఫెక్ట్... ఐపీఎస్ అధికారి విశాల్ గున్నికి మళ్లీ బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 12:50:18  IST  )

ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వైసీపీ హయాంలో ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారంలో విశాల్ గున్ని పాత్రపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే

ముంబై నటి కేసు ఎఫెక్ట్... ఐపీఎస్ అధికారి విశాల్ గున్నికి మళ్లీ  బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని(IPS Officer Vishal Gunni) సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వైసీపీ(Ycp) హయాంలో ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు(Mumbai actress Kadambari Jethwani case) వ్యవహారంలో విశాల్ గున్ని పాత్రపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి ఆయనను సస్పెండ్ చేసింది. ఇబ్రహీంపట్నంలో నమోదు కేసులో విశాల్ గున్నిపై విచారణను కొనసాగిస్తోంది. విశాల్ గున్ని సస్పెన్షన్ రెండేళ్ల కాలం పూర్తి కావడంతో ఉన్నతస్థాయి రివ్యూ కమిటీతో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సెప్టెంబర్ 4 వరకు విశాల్ గున్ని సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ(Suspension Extension) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story