- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
26న ఏపీ అసెంబ్లీ సమావేశం.. కీలక బిల్లులపై చర్చించనున్న విద్యార్థులు
విద్యార్థులకు మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అసెంబ్లీతో పాటు మండలిలో ఏం జరుగుతుందనేది తెలియజేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు 26న(ఎల్లుండి) మాక్ అసెంబ్లీ సమావేశాలునిర్వహించనున్నారు.రాజ్యాంగం ఆమోదం పొంది 76 ఏళ్లు అయిన సందర్బంగా ఈ సమావేశఆలను నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. తొలుత ప్రొటెం స్పీకర్ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా విద్యార్థులు పాల్గొంటారు. వారిలోనే అధికార పక్షం, ప్రతిపక్షంగా ఉంటారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా ఇద్దరు విద్యార్థులు వ్యవహరిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. జీరో అవర్ తర్వాత బిల్లుపై చర్చిస్తారు. వీటితో పలు అంశాలపై విద్యార్థులు చర్చిస్తారు. సుమారు 3 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా వీక్షిస్తారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షం ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.






