నకిలీ మద్యం ఘటనలో మరో సంచలనం.. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

నకిలీ మద్యం ఘటనలో మరో సంచలనం..  సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు సమగ్ర దర్యాప్తుపై సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అకోశ్ కుమార్‌ను, సభ్యుడిగా అభ్కారీ శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

దీంతో ఈ కేసులో సిట్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. పూర్తి దర్యాప్తు చేపట్టనున్నారు. ‘‘నకిలీ మద్యం మూలాలు, అక్రమ తయారీ, సరఫరా, పంపిణీ, అసలు సూత్రధారులు ఎవరు..?, ఎంత మేర ప్రజా ధనం కొల్లగొట్టారు. బాధితులు ఎవరు..?.’’అనే అంశాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది సిట్.

ఇకే ఇప్పటివరకూ ఈ కేసును ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసును సిట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి కేసును సిట్ దర్యాప్తు చేయనుంది.

Next Story