Breaking: శ్రేయ గ్రూపునకు షాక్.. ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశం

by Vemula.Srinu Prasad |

అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేసిన శ్రేయ గ్రూపు సంస్థ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది...

Breaking: శ్రేయ గ్రూపునకు షాక్.. ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేసిన శ్రేయ గ్రూపు సంస్థకు బిగ్ షాక్ తగిలింది. ఆ సంస్థ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతించింది. శ్రేయ గ్రూపు యజమాని హేమంత్ కుమార్‌తో పాటు ఆయన భార్య సంగీతారాయ్ పేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. దీంతో కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో ఉన్న 51.55 ఎకరాల భూమిపై చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు.

వివిధ స్కీముల పేరుతో మోసం

కాగా తన కంపెనీ స్కీముల్లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రజలను శ్రేయ గ్రూపు సంస్థ నమ్మించింది. ఈ మేరకు 8,128 మంది డిపాజిటర్లు దాదాపు రూ. 202 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కొద్దికాలం బాగానే నడిచిన వ్యాపారం ఆ తర్వాత అసలు రూపం బయటపడింది. అధిక వడ్డీలు ఇవ్వడమే కాదని, అసలు కూడా దక్కదని డిపాజిటర్లకు అనుమానం కలిగింది. ఆరా తీయడంతో తామంతా మోసపోయినట్లు తేలింది. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వాన్ని సీఐడీ అనుమతి కోరింది. సీఐడీ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం.. శ్రేయ గ్రూపు ఆస్తుల జప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story